ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్‌లాక్ 3.0 లో ఇవ్వాల్సిన మినహాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది. కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న అన్‌లాక్ 2.0 జులై 31తో ముగియనుంది. దీంతో అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది.
ఈసారి సినిమాహాళ్లకు, జిమ్లకు అనుమతి ఇవ్వాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాళ్లను ప్రారంభించినా పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతానికి విద్యా సంస్థల మూసివేతను కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. నేటి మంత్రివర్గ సమావేశంలో మినహాయింపులపై క్లారిటీ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment