
సాక్షి, న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్‌డౌన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు మిగతా కేబినెట్ మంత్రులంతా హాజరయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో నాలుగో దశ లాక్‌డౌన్ ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ 4.0 నిబంధనలను పూర్తి భిన్నంగా రూపొందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నాలుగో దశ లాక్‌డౌన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మే 18 లోపు వెల్లడిస్తామని ప్రధాని పేర్కొన్నారు. నాలుగో దశ లాక్‌డౌన్‌లో ఏయే రంగాలకు సడలింపులివ్వాలి, ఆర్థిక కార్యకలాపాలను దేశమంతటా ఎలా పరుగులు పెట్టించాలన్న దానిపై మోదీ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment