చాలామంది అధికారులు సిబ్బంది కోసం ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా ప్రజా సేవ చేసి ప్రజల మనసులను గెలుచుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చేసి నెటిజనుల మనసులను గెలుచుకున్నాడు.
వివరాల్లోకెళ్తే...బెంగుళూరులో భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ వర్షపు నీళ్లతో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. అక్కడ సమీపంలో ఉన్న డ్రెయిన్‌లోకి వాటర్ వెళ్లకుండా చెత్త అడ్డుపడటంలతో నీళ్లన్ని రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో ఒక ట్రాఫిక్ ఆఫీసర్ తానే స్వయంగా తన చేతులతో డ్రైయిన్‌ని క్లీన్ చేసి ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా చేశాడు. ఈ విషయం తెలసుకున్న ఐపీఎస్ దీపాంశు కబ్రా సదరు ట్రాఫిక్ ఆఫీసర్ జగదీష్ రెడ్డిని మెచ్చుకున్నారు.
పైగా గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు ముగ్గురు వ్యక్తులు మరణించారని, 75 వాహానాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ విధంగా అందరూ జగదీష్‌లా ఉద్యోగాన్ని హోదాగా భావించకుండా స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వస్తే ప్రమాదాలు తలెత్తవని ఐపీఎస్ అధికారి అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ట్రాఫిక్ అధికారి కర్తవ్య స్పూర్తిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్లు చేశారు.
#Bangaluru ट्रैफिक ऑफिसर #JagdishReddy ने अपने हाथ से नाली के मुहाने पर जमा कचरा साफ किया ताकि सड़क में जमा वर्षाज़ल निकले और आमजनों को दिक्कत ना हो.
— Dipanshu Kabra (@ipskabra) June 20, 2022
Commendable work. ये काम उनके Job Role में नहीं आता है, फिर भी ऐसा करना उनकी सेवा भावना व ड्यूटी के प्रति समर्पण दिखलाता है. pic.twitter.com/6Ue0naF3fl
Comments
Please login to add a commentAdd a comment