భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో.. | Woman Claiming She is Incarnation of Adi Parasakti at Chennai | Sakshi
Sakshi News home page

భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..

Published Tue, Dec 28 2021 7:35 AM | Last Updated on Tue, Dec 28 2021 12:15 PM

Woman Claiming She is Incarnation of Adi Parasakti at Chennai - Sakshi

సాక్షి, చెన్నై: గతంలో భర్త, కుమార్తెను వదిలి ప్రియుడే కావాలని రచ్చకెక్కిన ఓ మహిళ తాజాగా తాను ఆది పరాశక్తి అవతారం అని చెప్పుకుంటూ.. తెర మీదకు రావడం స్థానికులను విస్మయంలో పడేసింది. పైగా అన్నపూర్ణి అరసు మాతాజీగా భక్తులకు కొత్త సంవత్సరం వేళ  ఉపదేశం ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. దీంతో ఈ మాతాజీ కోసం పోలీసులు వేట మొదలెట్టారు.

వివరాలు..  చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌ లోని  ఓ కల్యాణ మండపం వేదిక అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి ఒకటిన దివ్య దర్శనం ఇవ్వనున్నారని, భక్తులకు ఉపదేశం చేయనున్నారని సామాజిక మాధ్యమాల వేదికగా ఆహ్వానం పలికే వీడియో వైరల్‌ అవుతోంది. ఈ మాతాజీ చుట్టూ భక్తులు ఆశీర్వచనాలు తీసుకోవడం, క్షణాల్లో ఆమె పూనకం వచ్చినట్టు ఊగి పోతు భక్తుల కోరికల్ని తీర్చడం, వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయ్యా యి. దీంతో పోలీసులు ఈ మాతాజీ ఎవరోఆరా తీసే పనిలో పడ్డారు.  

చదవండి: (భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో)



తెర మీదకు గత వివాదాలు 
2014లో ఓటీవీ ఛానల్‌ వేదికగా జరిగిన చర్చలో తనకు భర్త, 14 ఏళ్ల కుమార్తె కన్నా, ప్రియుడు అరసే ముఖ్యం అని స్పష్టం చేసి అతడితో వెళ్లి పోయిన అన్నపూర్ణే ఈ మాతాజీగా తేలింది.  అలాగే గత వివాదాల వీడియోలు సైతం తెర మీదకు తెచ్చే సోషల్‌ మీడియా పోస్టులు కూడా భారీగానే పెరిగాయి. మరింత లోతుగా సాగిన విచారణలో ప్రియుడి అరసు అనుమానాస్పదంగా గతంలో మరణించినట్టు తేలింది.

ఇక పోలీసుల రాకతో అన్నపూర్ణి, ఆమె భక్తులు పత్తా లేకుండా పోయారు. చెంగల్పట్టు పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, తమ సెల్‌ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసి వెళ్లిపోయారు.  దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మాతాజీని అరెస్టు చేసే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement