ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● 1,966 మంది ‘టీచర్స్’ ఓటర్లు ● 17,141 మంది పట్టభద్రులు.. ● పోలింగ్ సెంటర్లకు చేరిన సిబ్బంది
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో నేడు నిర్వహించనున్న ఎ మ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది బరిలో ఉన్నారు. జిల్లాలో 1,966 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17,141 మంది పట్టభద్రుల ఓటర్లుండగా 27 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామగ్రితో కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. వీరికి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సామగ్రిని అప్పగించారు. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్‌లోని రిసెప్షన్ సెంటర్లకు చేర్చనున్నారు.
సమస్యలుంటే తెలుపాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పైఅధికారులకు సమాచారం అందివ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, అదనపు ఎస్పీలు రాజేశ్‌మీనా, ఉపేంద్రరెడ్డి, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సమాచారం
టీచర్స్ అభ్యర్థులు : 15
పట్టభద్రుల అభ్యర్థులు : 56
జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు : 46
నిర్మల్ డివిజన్‌లో.. : 31
భైంసా డివిజన్‌లో.. : 15
గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు : 27
టీచర్ పోలింగ్ కేంద్రాలు : 19
మోడల్ కోడ్ కండక్ట్ టీం : 20
ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ : 4
వీఎస్‌టీ: 2
ప్రిసైడింగ్ అధికారులు : 37
పోలింగ్ సిబ్బంది : 148
సూక్ష్మ పరిశీలకులు : 26
నోడల్ అధికారులు : 19
జోనల్ అధికారులు : 10
Comments
Please login to add a commentAdd a comment