‘పది’ పరీక్షల్లో నూతన విధానం
లక్ష్మణచాంద: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే మొదట ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని జీపీఏ(గ్రేడింగ్) విధానాన్ని రద్దుచేసి పూర్వ పద్ధతిలో మార్కులు విధానం అమల్లోకి తెచ్చింది. మరోవైపు పరీక్షల జవాబు పత్రాలను బుక్‌లెట్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉంటాయి. విద్యార్థులకు సరిపడా బుక్‌లెట్లు జిల్లాకు చేరుకుంటున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 9,127 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
24 పేజీల బుక్ లెట్..
● గతంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రం ఓఎంఆర్ షీట్‌తోపాటు జవాబులు రాసేందుకు నాలుగు పేజీల బుక్‌లెట్ ఇచ్చేవారు. అందులో రాయడం పూర్తి అయిన తర్వాత విద్యార్థుల అవసరం మేరకు అడిషనల్ షీట్‌లు ఇ చ్చేవారు. ఈసారి అడిషనల్ షీట్స్‌కు బదులు గా 24 పేజీలతో కూడిన బుక్ లేట్‌ను విద్యార్థులకు అందజేయనున్నారు. సమాధానాలన్నీ ఆ బుక్‌లెట్‌లోనే రాయాల్సి ఉంటుంది.
జిల్లాలో మూడు చోట్ల...
పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సందర్భంగా అందజేసే 24 పేజీలు కలిగిన బుక్‌లెట్‌లు జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నాయి. వీటిని భద్రపరిచేందుకు జిల్లాలో మూడు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. నిర్మల్, ఖానాపూర్, భైంసాలో మూడు రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ రిసీవింగ్ సెంటర్ల నుంచి ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్ బుక్‌లెట్‌లను పరీక్ష కేంద్రాలకు తరలించనున్నారు.
ప్రభుత్వం నిర్ణయం మేరకు
రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలు చేసింది. ఇందులో భాగంగానే గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేసింది. అడిషనల్ షీట్స్‌కు బదులుగా 24 పేజీలతో కూడిన బుక్‌లెట్ అందజేస్తుంది. ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షల నిర్వహణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం.
– రామారావు, డీఈవో
అడిషనల్ పేపర్లకు బదులుగా 24 పేజీల బుక్‌లెట్ జిల్లాలో మూడు రిసీవింగ్ కేంద్రాల ఏర్పాటు
జిల్లా సమాచారం...
మొత్తం ఉన్నత పాఠశాలలు 235
మొత్తం పరీక్ష కేంద్రాలు 47
మొత్తం పది విద్యార్థులు 9127
‘పది’ పరీక్షల్లో నూతన విధానం
Comments
Please login to add a commentAdd a comment