
‘ఇథనాల్’ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి
● అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లాలో జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో రైతులు, మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో గ్రామంలో ప్రజలకు, పంటలకు ఇబ్బందులు తలెత్తుతాయని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి ఫ్యాక్టరీని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై పెట్టిన కేసులు అలాగే ఉన్నాయని తెలిపారు. కేసులు ఎత్తివేయాలని కోరారు.