
కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమావేశం
నిర్మల్‌చైన్‌గేట్: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధి కారులతో ఆమె యాసంగి వరి కొనుగోళ్ల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సి బ్బందికి శిక్షణ ఇవ్వాలని, కేంద్రాల్లో సరిపడా తూకపు, తేమ, ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు, గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాల ని తెలిపారు. సరిపడా హమాలీలు, లారీలను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం తూకం జరిగిన 24 గంటల్లోపు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రోజువా రీగా ధాన్యం కొనుగోళ్ల నివేదికలు అందజేయాలని తెలిపారు. మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. సమా వేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుధాకర్, ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, ఇన్‌చార్జి ఏడీ మార్కెటింగ్ గజానంద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, డీసీవో కార్యాలయ అధి కారి రాజమల్లు, జిల్లాలోని రైస్‌మిల్లర్లు, లారీ ట్రాన్స్‌పోర్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.