అజ్ఞాతంలో ఐదుగురు!
● సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన లింబయ్యగారి వెంకట్‌రెడ్డి 1999 నుంచి అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడన్నది పోలీసులకు తెలియదు. కాగా అతడిపై లక్ష రూపాయల రివార్డు ఉంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ నక్సల్స్ కార్యకలాపాలు జోరుగా సాగేవి. కొన్ని ప్రాంతాల్లో సమాంతర పాలన కొనసాగింది. 1990 నుంచి 2000 మధ్య కాలంలో జిల్లాలో ఆ పార్టీ కార్యకలాపాలు జోరుగా సాగాయి. నక్సలైట్ ఉద్యమం సీరియస్‌గా కొనసాగిన కాలంలో ఉమ్మడి జిల్లాలో చాలా మంది అజ్ఞాతంలో పనిచేశారు. కా మారెడ్డి ఏరియా దళం, ఎల్లారెడ్డి ఏరియా దళం, సి ర్నాపల్లి ఏరియా దళం, బాన్సువాడ ఏరియా దళం, సిరిసిల్ల ఏరియా దళాలు పనిచేసేవి. అయితే అప్ప టి ప్రభుత్వాలు విధించిన తీవ్ర నిర్భందంతో చాలా మంది లొంగిపోయారు. అలాగే అరెస్టులు, ఎన్‌కౌంటర్లతో జిల్లాలో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. ఉ మ్మడి జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్‌తో పాటు మి లిటెంట్లు, సానుభూతిపరులు 125 మంది వరకు ఎ న్‌కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది అరె స్టయ్యారు. అలాగే చాలా మంది లొంగిపోయారు.
మావోయిస్ట్ పార్టీగా అవతరించాక..
2004లో సీపీఐ(ఎంఎల్), పీపుల్స్‌వార్ తదితర పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. కాగా మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన సమయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన గంగుల వెంకటస్వామి అలియాస్ రమేశ్ నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు జోరుగానే సాగాయి. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగుతున్నపుడు ఊరూరుకు సాయుధ నక్సల్స్ వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో మానాల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో జిల్లాలో మావోయిస్టు పార్టీ గట్టి దెబ్బ తగిలింది. అనంతర పరిణామాల నేపథ్యంలో జిల్లాకు చెందిన వారిని పార్టీ ఇతర రాష్ట్రాలకు పంపించింది. దీంతో జిల్లాలో ఆ పార్టీ ఉనికి లేకుండాపోయింది.
కామారెడ్డి జిల్లాలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకపోయినా.. ఈ ప్రాంతానికి చెందిన పలువురు మాత్రం ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇస్రోజీవాడికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామితోపాటు అతడి కుమారుడు, కూతురు కూడా దండకారణ్యంలోనే ఉంటూ వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఆరెపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ దినేశ్‌తోపాటు అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన
లింబయ్యగారి వెంకట్‌రెడ్డి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వీరంతా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు సూచిస్తున్నారు.
దండకారణ్యంలో పనిచేస్తున్న
జిల్లా మావోయిస్టులు
స్వామితో పాటు ఆయన కొడుకు, కూతురుదీ అడవిబాటే
విప్లవోద్యమంలో ఎర్రగొల్ల రవి,
లింబయ్యగారి వెంకట్‌రెడ్డి
లొంగిపోవాలని సూచిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment