నాసిరకం సరుకులు వాడొద్దు
మాక్లూర్: విద్యార్థులకు అందించే భోజనంలో నాసిరకం సరుకులు వాడొద్దని సంయుక్త కలెక్టర్ అంకిత్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. కొన్ని గదులు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వండిపెడుతున్న సరుకులు నాణ్యంగా ఉండాలన్నారు. విద్యార్థులు గత సంవత్సరం కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఎంపీవో శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: నగరంలోని కలెక్టర్‌రేట్‌లోగల డీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవోల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గంగు సంతో ష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా శ్రీరామ్ నారాయణ, ఉపాధ్యక్షులు–1గా నీలావతి, ఉపాధ్యక్షులు–2గా రాములు నాయక్, జాయింట్ సెక్రెటరీగా వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నాగ్‌నాథ్, పబ్లిసిటీ సెక్రెటరీగా సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాలకిషన్, శంకర్, తిరుమల, రాజా శ్రీనివాస్ ఏ కగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈవో సాయా గౌడ్, అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు
పదవీ విరమణ తప్పదు
ఖలీల్‌వాడి: ఉద్యోగులకు పదవీ విరమణ తప్ప దని డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ శాఖలో పదవీ విరమణ చేసిన నిజామాబాద్ రూరల్ ఏఎస్సై యేముల వెంకయ్య, రుద్రూర్ పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ కోల విఠల్‌ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనిఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో గొ ప్ప విషయమన్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్‌రా వు, సిబ్బంది సతీష్, శ్రీనివాస్, తిరుపతి, పా షా తదితరులు ఉన్నారు.
రసవత్తరంగా కుస్తీ పోటీలు
లింగంపేట(ఎల్లారెడ్డి): కొర్పోల్ గ్రామంలోని హరిహర దేవాలయం వద్ద శుక్రవారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి మూడు తులాల వెండి కడెం వరకు కుస్తీ పోటీ లు పెట్టారు. పోటీల్లో గెలుపొందిన కుస్తీ వీరు లకు నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భా స్కర్, కాళీదాస్, ఏగొండ, రవి, లక్ష్మణ్, రాము లు, సత్యం తదితరులు పాల్గొన్నారు.
నాసిరకం సరుకులు వాడొద్దు
నాసిరకం సరుకులు వాడొద్దు
Comments
Please login to add a commentAdd a comment