నగరంలో ఒకరి ఆత్మహత్య
ఖలీల్‌వాడి: నగరంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని పూసలగల్లీకి చెందిన బద్దూరి లక్ష్మణ్(41) గతేడాది కాలంగా కాళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఎంతకీ వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ అదృశ్యం
మాక్లూర్: మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన వివాహిత కారం సుజాత అదృశ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గత నెల 15న భర్త కారం నవీన్‌తో ఆమె గొడవ పడి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆమె ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక లారీ పట్టివేత
మాచారెడ్డి: పాల్వంచ మండలంలోని మర్రి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అనిల్ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకుని సీజ్ చేశామన్నారు. ఒక ఇసుక ట్రాక్టర్‌ను కూడా పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవన్నారు.
అడవుల్లో ఇసుక డంపులు
రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట, మద్దికుంట, సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో భారీగా ఇసుక డంపులు కలకలం సృష్టించాయి. ఇసుక డంపులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యథేచ్ఛగా అటవీ ప్రాంతంలో నుంచి అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేస్తున్నా ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి వేసినా ఆటవీశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వెంటనే ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment