ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ అన్నారు. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆయన ఇంటర్ పరీక్షల నిర్వహణపై సూపరింటెండెంట్‌లు, డిపార్టమెంటల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, ఖచ్చితంగా నియమ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధం కావాలన్నారు. జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాల బండిల్లను పోలీసు బందోబస్తుతో తీసుకువెళ్లిన తర్వాత పరీక్ష కేంద్రంలో ఖచ్చితంగా సీసీ కెమెరాల ముందు మాత్రమే విప్పాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే సమీపంలోని పోస్ట్‌ఆఫీస్‌లలో జవాబు పత్రాల బండల్‌లను నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బంది, ఉద్యోగులపై ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఉద యం 8.15 నుంచి విద్యార్థులను అనుమతిస్తారని, 9గంటలకు గేట్ మూసివేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment