నిజామాబాద్
వాతావరణం
ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది.
అజ్ఞాతంలో ఐదుగురు!
ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు పార్టీకి ఉనికి లేకపోయినా పలువురు ఉద్యమంలో
కీలక పాత్ర పోషిస్తున్నారు.
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లో u
సాలూర మండలం జాడిజమాల్‌పూర్ గ్రామ శివారులో నీళ్లు అందక నెర్రెలుబారిన పొలం
బోధన్: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. బోధన్ ఉమ్మడి మండలంలోని డీ–28/14 కాలువ కింద చేతికొచ్చిన పంటలకు నీటి గండం ఏర్పడింది. నీళ్లందక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీ–28 కాలువ వర్ని మండలంలోని తగెలేపల్లి గ్రామ శివారులో ప్రారంభమవుతుంది. బోధన్ మండలంలోని పెంటాకుర్దు క్యాంప్ మీదుగా సా లూర మండలంలోని సాలంపాడ్ క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్‌పల్లి, కొప్పర్తి క్యాంప్, సాలూర క్యాంప్, ఫత్తేపూర్, జాడిజమాల్‌పూర్ వరకు కాలువ విస్తరించి ఉంది. కాలువ కింద 11 వేల ఎకరాల ఆయకట్టులో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం వరి, మొ క్కజొన్న పంటలు చేతికొస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి ఫిబ్రవరి 21న నాలుగో విడత నీటి విడుదల ప్రారంభం కాగా, ఇప్పటి వరకు కాలువకు నీళ్లు రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో నీటి సరఫరా గడువు ముగియనుండడంతో ఇంకా పది రోజులపాటు నీటి విడుదల పొడిగించాలని కోరుతున్నారు. కాలువకు 450 క్యూసెక్కుల పరిమాణానికి తగ్గకుండా నీటిని సరఫరా చేస్తేనే పంటలు బతుకుతాయని చెబుతున్నారు. కాగా, రెండ్రోజులుగా 435 క్యూసెక్కుల నీళ్లు వదిలామని అధికారులు చెబుతుండగా, 250 నుంచి 350 క్యూసెక్కులకు మించి కాలువకు నీళ్లు సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో సాలూర క్యాంప్, ఫత్తేపూర్, జాడిజమాల్‌పూర్ గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాడిజమాల్ గ్రామ శివారులోని సుమారు 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలకు నీరందక నేల నెర్రెలు బారడం గమనార్హం.
సాలూర క్యాంప్ జీపీలో అధికారులను
నిర్బంధించిన గదికి తాళం వేస్తున్న రైతులు
సాలూర క్యాంప్ జీపీ ఆవరణలో రైతులతో చర్చిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు
న్యూస్‌రీల్
ఎండుతున్న పొలాలు
సాలూర క్యాంప్, ఫత్తేపూర్, జాడిజమాల్‌పూర్ గ్రామాల
రైతుల ఆందోళన
వారం క్రితమే నిజాంసాగర్ నుంచి
నీటి విడుదల
కాలువల్లో కనిపించని నీటి తడులు
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment