రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
మాక్లూర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హను మంతు సూచించారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న చికిత్సలు, నిర్వహిస్తున్న రక్త పరీక్షలపై వైద్యుడు సయ్యద్ అజ్మత్ హైమద్‌ను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ రిజిస్టర్ తనిఖీ చేసి, పీహెచ్‌సీలో ఉన్న ఔషధాలపై ఆరా తీశారు. ఒక్కోరోజు ఎంతమందికి బీపీ, డయాబెటిక్ పరీక్షలు చేస్తున్నారని వైద్యుడిని అడిగారు. వ్యాక్సినేషన్ గదిని సందర్శించి వ్యాక్సిన్‌లు, స్టోర్ గదిలోని మందుల గడువు తేదీలను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను రెండు రోజులకోసారి శుభ్రం చేయించాలని ఎంపీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. అనంతరం ఎలియానాయక్ తండాలో ఉన్న బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. వంట గది, భోజనశాలను పరిశీలించి సరుకుల నాణ్యత తెలుసుకున్నారు. నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ పద్మలత, గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ విద్యారాణి ఉన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
బాలికల మినీ గురుకులాన్ని
సందర్శించిన కలెక్టర్
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
Comments
Please login to add a commentAdd a comment