నెలాఖరు వరకు ఓటీఎస్‌కు గడువు
సుభాష్‌నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని ఖాతాదారులైన రైతుల సౌకర్యార్థం ఏకకాల పరిష్కార పథకం (ఓటీఎస్)కు ఈ నెల 31 వరకు గడువు ఉన్నట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయ న మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా దీర్ఘ కాలిక రుణాల చెల్లింపు, కాలపరిమితి ముగిసిన రుణాల చెల్లింపు కోసం డీసీసీబీలో ఓటీఎస్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా వాయిదా మీరిన వడ్డీలో 40 శాతం రాయితీ, అపరా ధ వడ్డీలో వందశాతం రాయితీ వెసులుబాటు క ల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సొసైటీల ద్వారా బట్వాడా చేసిన దీర్ఘకాలిక రుణాలు, డీసీసీ బీ ద్వారా బట్వాడా చేసిన నాన్ ఫామ్ సెక్టార్, స్వ యం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్‌లు, దీర్ఘకాలిక మార్ట్‌గేజ్ రుణాలకు వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సొసైటీ, ఎన్‌డీసీసీబీ శాఖలో సంప్రదించాలన్నారు. ఓటీఎస్‌ను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని డీసీసీబీ ఖాతాదారులు, సొసైటీ సభ్యులు సద్వినియోగం చేసుకొని రుణ విముక్తులు కావాలని ఆయన కోరారు.
యూరియా కొరత లేదు
జిల్లాలో యూరియా కొరత ఎక్కడా లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైర్మన్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. యూరియాను పొదుపుగా వాడుకోవాలని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ లింగయ్య పాల్గొన్నారు.
రైతులు అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలి
యూరియాను పొదుపుగా వాడుకోవాలి
ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment