కదిలిన అధికారులు
సాలూర క్యాంప్, జాడిజమాల్‌పూర్, ఫత్తేపూర్ గ్రామాల రైతుల ఆందోళనకు నీటిపారుదల శాఖ, జిల్లా అధికార యంత్రాంగం కదలింది. శుక్రవా రం సాయంత్రం నీటిపారుదల శాఖ నిజామాబా ద్ యూనిట్ సీఈ మధుసూదన్‌రావు, ఎస్‌ఈ బద్రీనారాయణ, డివిజన్ డీఈ భూమన్న, ఏఈలు సత్యనారాయణ, శృతి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు రైతులతో కలిసి కాలువలో నీటిపారకం పరిస్థితిని పరిశీలించారు.
వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామ శి వారులోని డీ–28 మెయిన్ కెనాల్, బోధన్, సా లూర మండలంలోని కాలువ వెంట పర్యటించా రు. కాలువపై అనధికారికంగా కొందరు రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి బాన్సువాడ డివిజన్ సీఈ శ్రీనివాస్, ఈఈ రాజశేఖర్ క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న ట్లు అధికారులు తెలిపారు. అధికారుల వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, మందర్న రవి, సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, సా లూర క్యాంప్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రావు ఉ న్నారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు దిద్దుబాటు చర్యలు ఉపక్రమించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
డీ–28 కాలువలో నీటిపారకం పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment