
ఉపాధ్యాయుడిగా నాడు తండ్రి.. నేడు కొడుకు
ఒకే పాఠశాలలో విద్యాబోధన..
మాచారెడ్డి: తండ్రీకొడుకులు ఒకే పాఠశాలలో విద్యా బోధన చేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. రాజన్న–సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన వేషాల బాలయ్య లచ్చపేట ఉన్నత పాఠశాలో 1993–1995వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన పని చేసిన సమయంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. తదుపరి బాలయ్య అనారోగ్యానికి గురికావడంతో బాలయ్య కుమారుడు శ్రీనివాస్ విద్యావలంటీర్‌గా ఇదే పాఠశాలలో 1995–1996 వరకు పనిచేశాడు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి గంభీరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 2023 నవంబర్‌లో డిప్యుటేషన్‌పై వచ్చి విద్యార్థులకు పాఠాలు బోఽధించాడు. 2024 అక్టోబర్‌లో రెగ్యులర్ ఉపాధ్యాయుడిగా ఇదే పాఠశాలకు బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఇదే పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాడు. నాడు తండ్రి, నేడు తనయుడు ఒకే పాఠశాలలో పనిచేయడం ఆసక్తికర విశేషం.
ఆనందగా ఉంది
మా నాన్న పనిచేసిన పాఠశాలలో నేను ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది. మానాన్న చదువు చెప్పిన నాటి విద్యార్థుల కుమారులకు, కుమార్తెలకు నేను విద్యాబోధన చేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. – శ్రీనివాస్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, లచ్చాపేట

ఉపాధ్యాయుడిగా నాడు తండ్రి.. నేడు కొడుకు

ఉపాధ్యాయుడిగా నాడు తండ్రి.. నేడు కొడుకు