ప్రముఖ సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకి భారతరత్న ఇవ్వాలంటూ ప్రవాస భారతీయులు డిమాండ్ చేశారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శంకర నేత్రాలయ (యూఎస్‌ఏ) అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో 2022 ఏప్రిల్ 3న జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా బాల ఇందుర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయత భువనచంద్ర, ఘంటసాల కుమార్తె శ్యామలలు ఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ న్యూస్ ఎడిటర్ అఫ్ ఇండియా ట్రిబ్యూన్ రవి పోనంగి (యూఎస్), న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షురాలు శ్రీలత మగతల, తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షులు రుద్ర కొట్టు, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షులు శివరామ కృష్ణ బండారులతో పాటు ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో అనేక 53 టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా రత్న కుమార్ కవుటూరు (సింగపూర్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), ఆదిశేషు (ఆస్ట్రేలియా) వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment