![Joe Biden Names Indian American Sopen Shah as Attorney - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/9/Biden_Indo_Attorney.jpg.webp?itok=4LT3l-lP)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తన జట్టులో ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన బి. సోపెన్ బి షాను వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్‌కి యూఎస్ స్టేట్స్ అటార్నీగా బైడెన్ నామినేట్ చేశారు.
జూన్ 6వ తేదీన వైట్‌హౌస్ ప్రకటించిన ఆరుగురు యూఎస్ అటార్నీ జాబితాలో సోపెన్ షా కూడా వున్నారు. ట్రంప్ హయాంలో నియమితుడైన స్కాట్ బ్లేడర్ స్థానంలో సోపెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం.. అసిస్టెంట్ యూఎస్ అటార్నీ టిమ్ ఓషీయా ప్రస్తుతం తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోపెన్ నియామకం ఆమోదించబడితే.. మాడిసన్‌లోని యూఎస్ అటార్నీ కార్యాలయానికి నాయకత్వం వహించే రెండవ మహిళగా ఘనత దక్కించుకుంటారు.
సోపెన్ షా 2017 నుంచి 2019 వరకు విస్కాన్సిన్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా హైప్రొఫైల్ సివిల్, క్రిమినల్ అప్పీల్స్‌లో వాదనలు వినిపించారు. సెకండ్ సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తి డెబ్రా ఆన్ లివింగ్‌స్టన్‌కు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోసం యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి అముల్ ఆర్.థాపర్‌కు లా క్లర్క్‌గా పనిచేశారు. కెంటుకీలో స్థిరపడిన సోపెన్ షా.. 2015లో యేల్ లా స్కూల్ నుంచి జేడీ, 2008లో హార్వర్డ్ కాలేజీ నుంచి ఏబీ మాగ్నా కమ్ లాడ్‌ను అందుకున్నారు. 2019 నుంచి పెర్కిన్స్ కోయి ఎల్‌ఎల్‌పీ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment