
సాక్రమెంటో : కాలిఫోర్నియాలోని బే ఏరియాలో వెటా (వుమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం వెటా వ్యవస్థాపక అధ్యక్షురాలు, సలహాదారు, ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కాగా, ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఫౌండర్ చైర్ పర్సన్ ఝాన్సీ రెడ్డి, సహ చైర్ పర్సన్ అభికొండలు ఆధ్వర్యంలో జరిగింది. దీనిలో ప్రెసిడెంట్‌గా శైలజ కల్లూరి, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్, వాషింగ్టన్ డీసీ నుంచి కూడా ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమం ఆన్‌లైన్ మాధ్యమంగా జరిగింది. ఈ సదర్భంగా వెటా అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు అన్నిరకాలు అవకాశాలు కల్పించి, వారిలోని కళలను సాకారం చేసుకోవడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని అన్నారు. నూతన ప్రెసిడెంట్ శైలజ కల్లూరి మాట్లాడుతూ.. ఈరోజు నామినేటేట్ కార్యవర్గ సభ్యులందరు ప్రమాణ స్వీకారం చేయడానికి సమావేశం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ సంస్థ మహిళా సాధికారికత కోసం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే సంవత్సరంలో చేయాలను కుంటున్న కార్యక్రమాలన్ని ఇప్పటి నుంచే తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment