ఆదాయంలో విజయవాడ డివిజన్ రికార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇంకా 11 రోజులు ఉండగానే విజయవాడ రైల్వే డివిజన్ రూ.5,638 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. అందులో సరకు రవాణా ద్వారా రూ.4,092.21 కోట్ల ఆదాయంతో రవాణాలోనే సుస్థిరమైన వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,625 కోట్ల స్థూల ఆదాయం రాగా, అందులో సరకు రవాణా ద్వారా రూ.4,032 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు డివిజన్ స్థూల ఆదాయం రూ.5,638 కోట్లు కాగా, అందులో 72.6 శాతం భాగం సరుకు రవాణా ద్వారా రూ.40,98 కోట్లు, 23.78 శాతం ప్రయాణికుల ఆదాయంతో రూ.1,342 కోట్లు, 1.9 శాతంతో ఇతర కోచింగ్ సేవలు (పార్శిల్, టికెట్ తనీఖీలు) ద్వారా రూ.109 కోట్లు, 1.6 శాతం ఇతర మార్గాల ద్వారా రూ.89 కోట్లు ఆదాయం సమకూర్చుకుంది. ఆదాయంలో డివిజన్ వృద్ధి సాధించడం పట్ల సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్రవర్మలను డీఆర్‌ఎం ప్రత్యేకంగా అభినందించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,638 కోట్ల స్థూల ఆదాయం 72.6 శాతం సరకు రవాణా ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment