సమీకృత నీటి కుంటల ఏర్పాటుకు ప్రోత్సహించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలా ల్లో సమీకృత నీటికుంటలు ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. వర్షాకాలం నాటికి కుంటలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపాధి హామీ పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టరేట్ నుంచి అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడుతూ నీటి కుంటల్లో చేపలు పెంచుతూ, కుంట గట్లపై కూరగాయల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం కూడా పొందవచ్చన్నారు. జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 కుంటలు మంజూరయ్యాయని, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి, పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమా వేశంలో డ్వామా పీడీ ఎ.రాము, డీపీవో పి.లావణ్య కుమారి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment