
కలంకారీ పరిశ్రమలన్నీ సంఘటితం కావాలి
పెడన: కలంకారీ పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి రావాలని, అప్పుడు క్లస్టర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం గూడూరు రోడ్డులోని దేవాంగ కల్యాణ మండలంలో కలంకారీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంను ఎస్‌ఎంఎస్‌ఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కలంకారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వత పరిష్కారంతో పాటు కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే కలంకారీ క్లస్టర్‌కు అవసరమైన స్థలాలను, భవనాలను గుర్తించి వాటి అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, కలెక్టర్ కూడా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ఎస్‌ఎంఎస్‌ఈ జీఎం వెంకట్రావు, జ్యూవెలరీ పార్క్ అధ్యక్షుడు వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
కలంకారీ క్లస్టర్ డెవలప్‌మెంట్
ప్రోగ్రాంలో ఎమ్మెల్యే కాగిత