
వైభవంగా శోభాయాత్ర
విజయవాడ కల్చరల్: మూర్తీభవించిన ధర్మానికి ప్రతిరూపం రామచంద్రమూర్తి అని తాళ్లయపాలెం శైవపీఠాధిపతి శివస్వామి అన్నారు. శ్రీ రామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామచంద్రమూర్తి శోభాయాత్ర, బైక్ ర్యాలీ గురువారం బీఆర్టీఎస్ రోడ్డులో ఆదివారం ప్రారంభమైంది. శివస్వామి మాట్లాడుతూ కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు అని అభివర్ణించారు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో అయోధ్యలో రామమందిరం సాకారమైందన్నారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ హిందూ బంధువులందరూ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. అన్యాక్రాంతమైన దేవాలయాల ఆస్తులను అప్పగించాలని సూచించారు. ప్రతి ఇంట్లో రామయం ఉండాలని బాల బాలికలకు రామకథను వినిపించాలని సూచించారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర, మీసాలరాజారావు వంతెన, అయోధ్యనగర్, సింగ్‌నగర్ మీదుగా బసవపున్నయ్య స్టేడియానికి చేరుకుంది. మహిళలు బైక్ నడుపూ జై శ్రీరాం నినాదంతో పాల్గొనడం విశేషం. రామనవమి ఉత్సవ కమిటీ నిర్వాహకుడు నాగలింగం శివాజీ, బీజేపీ నేతలు పీయూష్ దేశాయ్, మువ్వల సుబ్బయ్య, గొల్లపల్లి నగేష్ పాల్గొన్నారు.

వైభవంగా శోభాయాత్ర