భువనేశ్వర్: నగరంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో వాయు నాణ్యత శాతం దిగజారుతోంది. ప్రధానంగా ఈ ఏడాది దీపావళి తర్వాత నుంచి ఈ కాలుష్యం మరింత అధికమైంది. తాజా సమాచారం ప్రకారం నగరంలో వాయు నాణ్యత 171 యూనిట్లకు పరిమితం అయింది. జాతీయ స్థాయిలో కలవరపరుస్తున్న ఢిల్లీ వాయు నాణ్యత (ఏక్యూఐ) 371 యూనిట్లు కొనసాగుతున్న తరుణంలో నగరంలో పరిస్థితి దీని చేరువకు పాకుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. నగరంలో తాజా వాయు నాణ్యత లెక్క ప్రకారం భువనేశ్వర్ రెడ్ కేటగరీలోకి చేరింది. ఏక్యూఐ 151 నుంచి 200 యూనిట్ల మధ్య చేరితే ఆ ప్రాంతం వాయు కాలుష్యం ప్రమాదం అంచుల్లో ఉన్నట్లు పరగణిస్తారని వాతావరణ నిపుణుల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment