రహదారి ఏర్పాటు చేయాలని ఆందోళన
రాయగడ:
జిల్లాలోని మునిగుడలో టికిరపడ రైల్వే క్రాసింగ్ వద్ద అండర్ గ్రౌండ్ రహదారిని నిర్మించాలని ప్రగతి మంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. దీనిలో భాగంగా మునిగుడలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ కూడలి నుంచి రైల్వేస్టేషన్ వరకు వందలాది మంది ఆందోళనకారులు ర్యాలీలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. అనంతరం రైల్వేస్టేషన్ ఎదుట బైఠాయించారు. టికిరిపడ ప్రధాన రహదారి వద్దనున్న రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు పడుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు ఎదురవుతున్నాయన్నారు. అందువలన అండర్ గ్రౌండ్ రహదారి ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళన చేస్తున్నామని ప్రగతి మంచ్ అధ్యక్షుడు సీహెచ్ గణేశ్వరరావు, నందకిషోర్ పట్నాయక్, సింహా చల్ పండ తదితరులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment