కుసుమిలో మండీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కుసుమిలో మండీ ప్రారంభం

Published Thu, Dec 19 2024 7:51 AM | Last Updated on Thu, Dec 19 2024 7:51 AM

కుసుమిలో మండీ ప్రారంభం

కుసుమిలో మండీ ప్రారంభం

జయపురం: కొట్‌పాడ్‌ సమితి కుసిమి గ్రామంలో బుధవారం సాయంత్రం ధాన్యం మండీ ప్రారంభించారు. కొట్‌పాడ్‌ ఎమ్మెల్యే రూపు భొత్ర మండీని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు ఉండకూడదని అధికారులకు, ప్రొక్యూర్‌ మెంట్‌ ఏజెంట్లకు స్పష్టం చేశారు. మండీ నియమ నిబంధనలను సివిల్‌ సప్‌లై అధికారి ఆశిష్‌ దాస్‌ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా లేంప్స్‌, ఆర్‌ఎంసీ అధికారులు ఎఫ్‌ఏక్యూ క్వాలిటీ ధాన్యం మాత్రమే కొంటామని స్పష్టం చేశారు. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనలేదు. రైతులు విజ్ఞప్తి చేసినా వినలేదు. కార్యక్రమంలో కొట్‌పాడ్‌ సమితి అధ్యక్షులు కమళ భొత్ర, బీడీఓ బిక్రమ దొర, కొట్‌పాడ్‌ ఎన్‌ఏసీ మాజీ ఉపాధ్యక్షులు బాపూన్‌ ద్రిపాఠీ, సివిల్‌ సప్‌లై అధికారి ఆశిష్‌ దాస్‌, లేంప్స్‌ ఎండీ, రాజి నాయిక్‌, కుసిమి సర్పంచ్‌ సనమతి గదబ, సమితి సభ్యులు జానకీ గదబ, సమితి ఉపాధ్యక్షులు బాబులి పాణిగ్రహి, లేంప్స్‌ అధ్యక్షులు పద్మ భోత్ర, రాజేంద్ర రథ్‌, కేసీసీ బ్యాంక్‌ ఉపాధ్యక్షులు దురుపత భొత్ర, ఘనశ్యామ్‌ బిశాయి తదితరులు పాల్గొన్నారు.

20న ఎల్‌ఎల్‌బీ స్పాట్‌ అడ్మిషన్లు

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో లాసెట్‌ – 2024 తుది విడత కౌన్సెలింగ్‌ తరువాత మిగులు సీట్లకు ఈ నెల 20న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ పి.సుజాత బుధవారం తెలిపారు. డిగ్రీలో ఓసీ– 45 శాతం, బీసీ–42 శాతం, ఎస్టీ, ఎస్సీ– 40 శాతం మార్కులు కలిగి ఉండి లాసె ట్‌ –2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. లాసెట్‌ ర్యాంకు కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, టీసీల తో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజు స్ట్రక్చర్‌ రూ.10345, పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. స్పాట్‌ అడ్మిషన్ల కు ఎటువంటి ప్రభుత్వ రాయితీలు వర్తించబోవని స్పష్టం చేశారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 60 సీట్లకు గాను 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇందులో రెండు ఈడబ్ల్యూఎస్‌ సీట్లు ఉన్నట్లు వివరించారు. విద్యార్థుల ఎక్కువగా హాజరైతే ర్యాంకు మెరిట్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.

విద్యార్థి అదృశ్యం

శ్రీకాకుళం రూరల్‌: మండలంలో పెదపాడు పరిధి శాస్త్రులపేటలోని ఎంజేపీఏ ఏపీ బీసీడబ్ల్యూ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి వాసుపల్లి నేతాజీ ఈనెల 17వ తేదీన ఉదయం అదృశ్యమైనట్లు విద్యార్థి తండ్రి వాసుపల్లి ధనరాజు బుధవారం శ్రీకాకుళం రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి సోంపేట మండలం ఇసుకలపాలేం గ్రామానికి చెందినవాడని తెలిపారు. రూరల్‌ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆచూకీ తెలిసినవారు 63099 90845 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

పొలంలో గుర్తు తెలియని

మృతదేహం

మెళియాపుట్టి : మండలంలోని గొప్పిలి గ్రామశివారులో కొల్లాన సూర్యనారాయణ అనే రైతు పొలంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. కొందరు రైతులు అటుగావె వెళ్లడంతో మృతదేహాన్ని గుర్తించి వీఆర్వో సింహాచలంకు సమాచారం అందించారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. వృద్ధుడు రెండు వారాలుగా గొప్పిలి పరిసర ప్రాంతంలోనే తిరుగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం ఏపీఎస్‌ఆర్టీసీ 1వ, 2వ డిపోలలో ఆన్‌కాల్‌ డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని డిపో మేనేజర్లు అమరసింహుడు, కె.ఆర్‌.ఎస్‌.శర్మ తెలిపారు. ఈ మే రకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఈ నెల 24వ తేదీలోగా శ్రీకాకుళం 1వ, 2వ డిపోల కార్యాలయాలలో సంప్రదించాలని పేర్కొన్నా రు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ వచ్చి 18 నెలలు పూర్తయిన వారు అర్హులని తెలిపారు. పాస్‌ఫోటో, బ్లడ్‌ గ్రూప్‌ సర్టిఫికెట్‌, జెన్యూన్‌ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని, వివరాలకు 99592 25608, 9959225609 నంబర్లను సంప్రదించాలని కోరారు.

గ్యాస్‌ సిలిండర్ల దొంగలు అరెస్టు

పొందూరు: మండలంలో గ్యాస్‌ సిలిండర్లు, సెల్‌ఫోన్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గు రు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల గ్యాస్‌ సిలిండర్లు మాయమవుతున్నాయని, సెల్‌ఫోన్లు చోరీ అవుతున్నాయని పలు వురు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ వి.సత్య నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలో కి దిగి టెక్కలి మండలం గోపీనాథపురం గ్రా మానికి చెందిన కొమ్ము కార్తీక్‌, గాలి వెంకటేష్‌, నగిరి నాగరాజులను అదుపులోకి తీసుకున్నా రు. వారి వద్ద నుంచి 4 సెల్‌ఫోన్లు, 30 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొమ్ము కార్తీక్‌, గాలి వెంకటేష్‌ గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వారని ఎస్సై తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement