–8లోu
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
అంగన్‌వాడీ పోస్టు రద్దు చేయండి
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ సమితి గుజునిగుడ పంచాయతీ కసమగుడ గ్రామంలో అంగన్‌వాడీ వర్కర్ పోస్టును రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఆసక్తి, అర్హత కలిగిన మహిళలు ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలకు చెందినవారిని నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఇతర గ్రామాలకు చెందినవారు తమ గ్రామస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి అంగన్‌వాడీల భర్తీకి నోటీఫికేషన్ ప్రభుత్వం ఇచ్చిందని, అయితే ఈసారి ఇతర గ్రామస్తులతో భర్తీచేస్తే గ్రామంలోకి అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. కార్యక్రమంలో అశ్వినీ గౌఢ, ఘనశ్యామ్ గౌఢ, బుదాయి గౌఢ, తులసీ గౌఢ, చందన గౌఢ, జమున నాగ్, సతియ గౌడ, రమా హరిజన్, సునీత నాగ్, కమల లోచన గౌఢ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
జయపురం: స్థానిక ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(డైట్)లో రక్తదాన శిబిరం మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 51 యూనిట్ల రక్తం సేకరించినట్లు డైట్ ప్రిన్సిపాల్ రూపచంద్ర ప్రదాన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానంతో ప్రాణదానం చేయవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం లభించక ఎంతోమంది మరణిస్తున్నారని, అటువంటి వారికి రక్తదాన శిబిరాల్లో సేకరించిన నిల్వలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సుభస్మిత దాస్, ఒడిశా బ్లడ్ సెంటర్ అధికారి డాక్టర్ మధుసూదన బలియ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: ఒక బైక్ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసుస్టేషన్ అధికారి ఈశ్వర చంద్ర తండి మంగళవారం తెలియజేశారు. అరైస్టెనవారిలో ఒకరు మైనర్ కాగా, మరోవ్యక్తి జయపురం సమితి ధన్‌పూర్‌కు చందిన సామసన్ హరిజన అలియాస్ బుడు అని పేర్కొన్నారు. వారి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలుడిని జువైనల్ జస్టిస్ కోర్టుకు తరలించినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 2వ తేదీన జయపురం సమితి బొడొకావిడి గ్రామంలో గంగాధర పంగి ఇంట్లో పెళ్లికి బొడొకావిడి గ్రామానికి చెందిన పదన మాఝి తన బైక్‌పై వెళ్లాడు. పెళ్లి అనంతరం తిరిగి వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దీంతో జయపురం సదర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గగనాపూర్ పోలీసు పంటి అధికారి రాజకిశోర్ బారిక్ దర్యాప్తు జరిపి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. అనంతరం పొడైకర గ్రామంలో ఉంచిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దేవాలయం పరిశుభ్రం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని పురాతన నీలకంఠేశ్వర దేవాలయ ప్రాంగణాన్ని ఐకాన్స్ ఇన్‌మెషన్ ప్రతినిధులు మంగళవారం పరిశుభ్రం చేశారు. శివరాత్రి పురస్కరించుకొని కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
● మహేంద్రం.. జనసంద్రం
పర్లాకిమిడి: పవిత్ర మహా శివరాత్రి పురస్కరించుకుని మహేంద్రగిరికి మంగళవారం సాయంత్రం నుంచి భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది జిల్లా యంత్రాంగం తాగునీరు, విద్యుత్, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించింది. రాయఘడ ఆర్‌ఎస్‌ఎస్ శాఖ తరుపున యాత్రికులు బస చేయడానికి టెంట్లు, భోజన సౌకర్యం కల్పించారు. అలాగే పోలీసులు మహేంద్రంలో కుంతీ, యుధిష్టర, భీమ, పరశురాం మందిరం వద్ద భద్రత పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మందస, సాబకోట, కించిలింగి రోడ్డు మీదుగా కూడా భక్తులు మహేంద్రం చేరుకుంటున్నారు. రాత్రికి అక్కడ బసచేసి వేకువజామున సూర్యోదయం చూసి అన్ని మందిరాలను దర్శించుకుంటారు. గజపతి ఎస్పీ జితేంద్ర కుమార్ పండా యాత్రికుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.
పర్లాకిమిడి: కాలినడకన మహేంద్రగిరికి చేరుకుంటున్న యాత్రికులు
● గుప్తేశ్వర్‌లో ఏర్పాట్లు పరిశీలన
జయపురం: దక్షిణ ఒడిశాలోని సుప్రసిద్ధ శివక్షేత్రం గుప్తేశ్వర్ పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లును కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ సోమవారం పరిశీలించారు. మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటు అనేక మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ, రక్షిత తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అలాగే భక్తులు స్నానాలాచరించే శబరీ నది ఘాట్‌ను ఆయన సందర్శించారు. నదిలో ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బందిని ఘాట్ వద్ద నియమించాలని సూచించారు. మొత్తం శాంతి భధ్రతలు కాపాడేందుకు 15 ప్లాటూన్ల పోలీసు బలగాలను నియమించినట్లు ఎస్పీ రోహిత్ వర్మ తెలియజేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎ.శొశ్య రెడ్డి, జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అంకిత వర్మ, బొయిపరిగుడ తహసీల్దార్ స్నిగ్థ రాణి చౌదరి, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగ ఎస్‌డీవో అంకిత్ ప్రతీక తోయ తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: అలంకరించిన
కుంతీ మందిరం
● టిక్కెట్టు విధానం రద్దు చేయాలి
జయపురం: ప్రసిద్ధ శివక్షేతంర గుప్తేశ్వర్‌లో దర్శనానికి టిక్కెట్టు విధానం రద్దు చేయాలని సబ్ డివిజన్ బొయిపరిగుడ హిందూ సమాజ్ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ శొశ్యరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తుల నుంచి నిర్భందంగా టిక్కెట్టు కోసం డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ లింగరాజ్ మందిరం, పూరీ మందిరాల్లో సైతం దైవ దర్శనానికి టిక్కెట్టు వ్యవస్థ లేదని గుర్తు చేశారు. టిక్కెట్టు వ్యవస్థను రద్దు చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్వామీ బిశ్వా మిత్ర నందగిరి, రమేష్ నరోజీ, ఘన హంతాల్, రవీంద్ర నాయిక్, సంతోష్ మిశ్ర, రబీ ఖిలో, లంబోధర స్వై, పితబాస్ పంగి, గౌరహరి మాలి, సురేష్ స్వై పాల్గొన్నారు.
● గంగమ్మ ఒడిలో...
రాయగడ: సదరు సమితి తెరువలి సమీపంలోని పాయికొపొడ వద్దనున్న నాగావళి నది ప్రవాహానికి ఒక శివలింగం కొట్టుకొచ్చింది. మంగళవారం ఉదయం కొంతమంది గ్రామస్తులు నదిలో స్నానమాచరిస్తుండగా శివలింగాన్ని చూశారు. అనంతరం గ్రామస్తులంతా కలిసి పవిత్రమైన శివలింగాన్ని పాయికొపొడ మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రికి ముందే పరమేశ్వరుడి దర్శనం కావడం అదృష్టమని భావిస్తున్నారు.
కలుషిత నీటి వలనే మరణాలు
భువనేశ్వర్: పూరీ జిల్లా కొణాస్ ప్రాంతంలో కలుషిత నీటి వినియోగంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో దయా నదినీరు కలుషితం కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ విచారకర ఘటనపై ఒడిశా మానవ హక్కుల కమిషన్ చొరవ కల్పించుకుంది. ఈ నేపథ్యంలో ప్రమాదంపై బాధ్యులైన వారిని గుర్తించి విచారణకు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు రాష్ట్ర ఆరోగ్య, జల వనరులు, పంచాయతీ రాజ్, తాగునీరు శాఖ కార్యదర్శులు, పూరీ జిల్లా మేజిస్ట్రేటు వ్యక్తిగతంగా హాజరు కావాలని తాఖీదులు జారీ చేసింది.
న్యూస్‌రీల్
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
Comments
Please login to add a commentAdd a comment