పార్వతీపురంటౌన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లోని రద్దీ ప్రదేశాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. హెల్మెట్ వినియోగంతో ప్రమాదాలను నివారించవచ్చన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఈగల్ క్లబ్బులు ఏర్పాటుకావాలన్నారు. రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని, కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. మత్తుపదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో పోలీస్ యంత్రాంగం చూపిన పనితీరును కలెక్టర్ అభినందించారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జిల్లా యంత్రాంగంతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే హెల్మెట్‌ధారణ, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై అపరాధ రుసుం విధిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు నిబంధనలపై లారీ, ఆటో, ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో ఏఎస్పీ సురాన అంకిత్ మహావీర్, డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాథుడు, కేఆర్‌ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రా రెడ్ది, మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డాక్టర్ ఎం.వినోద్‌కుమార్, జిల్లా రవాణా అధికారి ఎం.శశికుమార్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి కె.కవిత, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, ఆర్‌అండ్‌బీ ఈఈ ఎస్.రామచంద్రరావు, ఎస్సీ, బీసీ సంక్షేమ అధికారులు ఎం.డి.గయాజుద్దీన్, ఎస్.కృష్ణ, ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్లు ఈఎస్‌కే దుర్గ, పి.వెంకటేశ్వరరావు, ఎ.భాస్కర్‌రెడ్ది, ఇతర శాఖాధికారులు కె.చిత్ర, పి.దామోదరరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment