బీమా పరిహారం అందజేత
పార్వతీపురంరూరల్: పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్‌శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కె.బుల్లిబాబు కుటుంబానికి పోలీసు శాలరీ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీంలో భాగంగా తొలివిడతగా యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.38 లక్షల చెక్కును ఎస్పీ మాధవ్‌రెడ్డి మంగళవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా సిబ్బంది వేతనాలను పోలీసు శాలరీ ప్యాకేజీ స్కీమ్‌లో భాగంగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా పోలీసు సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు సంబంధిత బ్యాంకులు బీమా మొత్తాన్ని ఇన్సూరెన్స్‌గా అందజేస్తాయన్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖాపరంగా మంజూరు చేసిన విడో ఫండ్ రూ.50వేలు చెక్కును కూడా మృతుడు బుల్లిబాబు కుటుంబసభ్యులకు అందజేశారు. అలాగే అనారోగ్యం కారణంగా మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ పోలిరాజుకు పోలీసుశాఖ పరంగా మంజూరు చేసిన రూ.25వేల చెక్కును కుటుంబసభ్యులకు ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment