పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి రాతపరీక్ష ద్వారా 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతివరకు ఆంగ్లమాధ్యమంలో మిగిలి ఉన్న సీట్లకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ డీడీ కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్, పి.కోనవలస (బాలురు) 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 3 సీట్లు, 7వ తరగతిలో 5 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఏపీటీడబ్ల్యూఆర్‌యుజేసీ, కురుపాం (బాలికలు) 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 2, 8వ తరగతిలో 2 సీట్లు ఉన్నాయి. ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్, భద్రగిరి (బాలురు) 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 6 సీట్లు, 7వ తరగతిలో 2, 8వ తరగతిలో 6, 9వ తరగతిలో 8 సీట్లు ఉన్నాయి. ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్, కొమరాడ (బాలురు) 5వ తరతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 4, 7వ తరగతిలో ఒకటి, 9వ తరగతిలో నాలుగు సీట్లు ఉన్నాయన్నారు. హెచ్‌టీటీపీఎస్://టీడబ్ల్యూఆర్‌ఇఐఎస్‌సెట్.ఏపీపీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కామన్ ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 6న ఏపీటీడబ్ల్యూఆర్ (బాలుర) పి.కోనవలస, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ (బాలికల) కురుపాం, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ (బాలుర) భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్(బాలుర) కొమరాడ కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment