
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
● అన్ని రంగాల్లోనూ విద్యార్థినులు దూసుకుపోవాలి
● సెంచూరియన్ వర్సిటీలో ఉమెన్
స్టూడెంట్ పార్లమెంట్
ప్రారంభోత్సవంలో గవర్నర్
హరిబాబు కంభంపాటి
పర్లాకిమిడి: విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులు నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలని.. భవిష్యత్తులో వారు పార్లమెంటులో 50 శాతం సభ్యులు మహిళలే ఉండాలని ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి ఆకాంక్షించారు. ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్శిటీలో బుధవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సును ప్రారంభించారు. అనంతరం 3వ జాతీయ ఉమెన్ స్టూడెంట్ పార్లమెంట్– 2024–25ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఉన్నాయని, సమీప భవిష్యత్తులో మీలో కొందరు పార్లమెంటరీయన్లయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఉన్నత విద్య, పరిశ్రమల స్థాపన, మహిళా శక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని చెప్పారు. కాగా, ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు 30 విశ్వవిద్యాలయాల నుంచి 200 మంది విద్యార్థినులు విచ్చేశారు. కార్యదర్శి మమతారాణి అగ్రవాల్, సెంచూరియన్ వర్శిటీ ఉపకులపతి (విశాఖపట్నం) డా.జి.ఎస్.ఎన్.రాజు, సి.యు.టి.ఎం.ప్రెసిడెంట్ డాక్టర్ ముక్తికాంత మిశ్రా, ఉపకులపతి (భువనేశ్వర్) డాక్టర్ సుప్రియా పట్నాయిక్, బరంపురం వర్శిటీ ఉపకులపతి గీతాంజలి దాస్, బిజూ పట్నాయిక్ టెక్నాలజికల్ యూనివర్శిటీ ఉపకులపతి డాక్టర్ అమియా కుమార్ రథ్ హాజరై ప్రసంగించారు. ఏ.ఐ.యు.చైర్మన్ సంగ్రాం కేసరి స్వయిని స్వాగత ఉపన్యాసం చేశారు. అనంతరం గవర్నర్ హరిబాబును ఉపకులపతి సుప్రియా పట్నాయిక్ దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.కార్యక్రమంలో సెంచూయన్ వర్శిటీ రిజిస్ట్రార్ అనితా పాత్ర్, కలెక్టర్ బిజయకుమార్ దాస్, ఎస్పీ జితేంద్రనాథ్ పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు.

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి