బడ్జెట్‌లో మన్యంకు మొండిచేయి
● జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలి ● నేడు బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన
పార్వతీపురంటౌన్: జిల్లా అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్ కు నిరసనగా శుక్రవారం పార్వతీపురం సుందర య్య భవనంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో మన్యం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులైన జంఝావ తి, తోటపల్లి, గుమ్మడిగెడ్డ, వట్టిగెడ్డ ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. జిల్లా లోని గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లాలో పీజీ కాలేజ్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ తదితర సంస్థల ఏర్పాటులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి పనులకు రూ.10వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 3.22 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సామా జిక రంగానికి, విద్య, వైద్యానికి కోత పెట్టడం విచా రకరమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి కేవలం రూ.10 కోట్లు కేటాయించడం తగదన్నారు. బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో బి.వి రమణ, పి రాజశేఖర్, నాయకులు పి. సన్యాసిరావు, బి.సూరిబాబు, ఎస్.ఉమామహేశ్వరరావు, జి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment