వైఎస్సార్‌సీపీలో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ రణభేరి బంగా రు నాయుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో శుక్రవారం ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీని వాసరావును విజయనగరంలోని జెడ్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం పురపాలక సంఘంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మాజీ ఎమ్మెల్యే జోగారావు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ భవిష్యత్ కార్యాచరణపై కొన్ని కీలక సూచనలు చేశారు. అనంతరం ఒకటవ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ రణభేరి బంగారు నాయుడు పార్టీ కండువా వేసుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్‌పర్సన్ కొండపల్లి రుక్మిణి, వైస్‌చైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, వివిధ వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment