సహనం నేర్పే రంజాన్..
● నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం
● నెల రోజుల పాటు కఠిన దీక్షలు,
దానధర్మాలు
● ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు
విజయనగరం టౌన్: యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్రమైన, సంతోషాలు పంచే నెల రంజాన్. ఈ నెల అరబీ నెలల వరుస క్రమంలో తొమ్మిదవది. రంజాన్ అంటే కాలిపోవడం, భస్మీపటలమవ్వడం, ఆగిపోవడం అనే అర్థాలను సూచిస్తుంది. రంజాన్ నెలలో తమ పాపాలు, పొరపాట్లు, తప్పిదాలన్నీ కాలిపోయి వాటికి బదులుగా పుణ్యఫలాలు పొందుతామనేది ముస్లింల నమ్మకం. ఈ శుభాల సరోవరం, వరాల వసంతం అయిన రంజాన్ మాసం నెల వంకను చూసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ నెలకు అల్లాహ్ దృషి్‌ోట్ల పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానముంది. విశ్వాసులకు ఎనలేని సంతోషాలు, పుణ్యాలను అందిస్తుంది ఈ మాసం. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు ఈ పవిత్రమాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు. ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించాలని జమాతే ఇస్లామీ హింద్ సంస్థ మతాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు మసీదులన్నీ విద్యుత్ అలంకరణలతో ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీల ప్రతినిధులు అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేపట్టనున్నారు.
ఉచితంగా నమాజ్ పుస్తకాల పంపిణీ...
రంజాన్ మాసంలో ఉచితంగా నమాజ్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు పట్టణ ముస్లిం ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాలు, మండలాల్లో 38 వేల నమాజ్ పుస్తకాలను పంపిణీ చేపట్టనున్నామన్నారు. అవకాశం ఉన్నవారందరూ పుస్తకాలను స్వీకరించాలని కోరారు.
సహనం నేర్పే రంజాన్..
సహనం నేర్పే రంజాన్..
Comments
Please login to add a commentAdd a comment