తొలిరోజు పరీక్ష ప్రశాంతం
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.మంజులావీణ తెలిపారు. పార్వతీపురం పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆమె శనివారం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,372 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష రాయాల్సి ఉండగా 6,127 మంది హాజరయ్యారని, 245 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. వృత్తి విద్యాకోర్సులకు సంబంధించి 2,963 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 2,622 మంది హాజరయ్యారని, 341 మంది గైర్హజరయ్యారని తెలిపారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష సజావుగా సాగిందన్నారు.
ఒక విద్యార్థి డీబార్
భామిని: భామిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడడంతో డీబార్ చేసినట్టు అధికారులు తెలిపారు.
34 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణ
586 మంది విద్యార్థులు గైర్హాజరు
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment