● Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢ Ñgôæ™èl˘ ● లేకుంటే 2, 3 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ● మొత్తం ఓట్లు 22,493 ● పోలైన ఓట్లు 20,794 ● పోలింగ్‌ శాతం 92.44 శాతం | - | Sakshi
Sakshi News home page

● Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢ Ñgôæ™èl˘ ● లేకుంటే 2, 3 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ● మొత్తం ఓట్లు 22,493 ● పోలైన ఓట్లు 20,794 ● పోలింగ్‌ శాతం 92.44 శాతం

Published Mon, Mar 3 2025 1:33 AM | Last Updated on Mon, Mar 3 2025 1:29 AM

● Ððl

● Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢

వీరఘట్టం:

త్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా నేడు సోమవారం ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలో చేయనున్నారు. పోటీలో పది మంది అభ్యర్థులున్నప్పటికీ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు పోలింగ్‌ సరళి స్పష్టం చేసింది. మిగిలిన అభ్యర్థులు కూడా తమ అనుచరులతో ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు చీలిపోయినట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. స్పష్టమైన మెజార్టీ ఎవరికీ వచ్చే పరిస్థితి లేదని ఉపాధ్యాయు లు చెబుతున్నారు. రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లుపైనే పోటీదారులు ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ విషయం

గత నెల ఫిబ్ర వరి 27న జరిగిన ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో 22,493 మంది ఓటర్లకుగాను 20,794 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.44 శాతం ఓటింగ్‌ జరిగింది. పోలింగ్‌ శాతం పెరగడంతో ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓటు చీలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుచే గెలుపునకు కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% ప్లస్‌ 1 ఓటు ఎవరికీ వచ్చే పరిస్థితి లేదంటున్నారు.

●మొత్తం చెల్లిన ఓట్లులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం ప్లస్‌ 1 ఓటు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.

●ఒకే వేళ ఈ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే మొత్తం పది మందిలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన చివరి అభ్యర్థి ఓట్లులో 2వ నంబర్‌ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును మిగిలిన తొమ్మిదిలో ఎంత మందికి వస్తే వారందరికీ ఆ ఓట్లు సర్దుతారు. చివరి వ్యక్తిని ఎలిమినేట్‌ చేస్తారు.

●అయినా ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే ఇప్పుడు ఉన్న 9 మందిలో తక్కువ ఓట్లు వచ్చిన ఓట్లులో 3వ నంబర్‌ ఓటు ఎంత మందికి వస్తే ఆ ఓటును మిగిలిన వారికి సర్దుతారు. తర్వాత చివరి అభ్యర్థిని ఎలిమినేట్‌ చేస్తారు.

●ఇలా మ్యాజిక్‌ ఫిగర్‌ వచ్చేంత వరకు చివరిగా ఉన్న అభ్యర్థుల ఓట్లను మిగిలిన వారికి సర్దుతూ, ఆ అభ్యర్థులను ఎలిమినేట్‌ చేస్తూ 50 శాతం ప్లస్‌ 1 ఓటు ఎవరికి వస్తే వారిని రిటర్నింగ్‌ అధికారి విజేతగా ప్రకటిస్తా రు. అక్కడితో ఎన్నిక తంతు ముగుస్తుంది.

●ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 123 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఉన్న ఓట్లు అన్నీ కలిపేస్తారు. దీంతో ఓట్లు లెక్కింపు సమయంలో ఏ మండలం నుంచి ఏ జిల్లా నుంచి పోటీదారులకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవ్వరికీ తెలియదు.

●ఓట్లు లెక్కింపునకు 20 టేబుల్స్‌ వేస్తారు. మొత్తం ఒకచో ట వేసిన ఓట్లును 25 ఓట్లు చొప్పున కట్టలు కడతారు. ఇలా 25 ఓట్లు ఉన్న 40 కట్టలను(1000 ఓట్లు) ఆ ఇరవై టేబుల్స్‌కు పంచుతారు.

●మొత్తం పోలైన ఓట్లు 20,794 కావున ఇందులో 20 వేల ఓట్లును 25 ఓట్లు చొప్పున 800 కట్టలు కట్టి ఇరవై టేబుల్స్‌కు సర్దుతారు. మిగిలిన 794 ఓట్లు చివరి టేబుల్‌కు ఇస్తారు.

●ఈ 20 టేబుల్స్‌లో తొలుత చెల్లినవి, చెల్లని ఓట్లు వేరు చేస్తారు. మళ్లీ చెల్లిన ఓట్లును 25 చొప్పున కట్టలు కడతారు.

●పోటీ చేసిన అభ్యర్థులు 10 మంది కావడంతో పది ట్రేల్‌ ఏర్పాటు చేస్తారు.

●ఈ పది ట్రేల్స్‌లో 25 చొప్పున కట్టిన ఓట్లులో 1వ నంబర్‌ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును ఆ ట్రేల్స్‌ లో వేసి వారికి వచ్చిన మొత్తం ఓట్లును లెక్కిస్తారు.

గెలుపు

ఇలా ..

కౌంటింగ్‌ ఇలా...

No comments yet. Be the first to comment!
Add a comment
● Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢1
1/1

● Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement