కూటమికి ఓ గుణపాఠం
మేధావుల
తీర్పు...
సాలూరు రూరల్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఇచ్చిన తీర్పు కూటమి ప్రజావ్యతిరేక పాలనకు చెంపపెట్టు అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘవర్మను గెలిపించాలంటూ ఊరూరా తిరుగుతూ, గురువులపై ఒత్తిడి తెచ్చిన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మేధావుల తీర్పును సామాన్యులు సైతం స్వాగతిస్తున్నారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రివి అర్థంలేని మాటలుగా పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమవాడే అంటూ ప్రకటించడాన్ని చూసి మేధావివర్గం నవ్యుకుంటోందన్నారు. 9 నెలల పాలనలో ఉపాధ్యాయుల పీఆర్‌సీ, ఈఆర్, పెండింగ్ బిల్లుల వంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కనీసం చొరవ చూపకపోవడంతో తగ్గిన బుద్ధిచెప్పారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రజాసేవలో ఉత్సాహంగా ఉండాలని, కూటమి పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల తీర్పు తేటతెల్లం చేసిందన్నారు.
గెలిచిన అభ్యర్థులు మా పార్టీ వారేనని చెప్పుకోవడం సిగ్గుచేటు
కూటమి నాయకుల తీరుచూసి నవ్యుకుంటున్న మేధావివర్గం
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
Comments
Please login to add a commentAdd a comment