గిరిజన సర్పంచ్‌లంటే అంత చులకనా?
సాలూరు రూరల్: గిరిజన సర్పంచ్‌లను చులకనగా చూస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై కోర్టు తీర్పుధిక్కరణ కేసు వేస్తామని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర స్పష్టంచేశారు. ఇంజినీరింగ్ అధికారులు గిరిజన సర్పంచ్‌లపై నిర్లక్ష్యధోరణి చూపుతున్నారంటూ పాచిపెంట మండలంలోని పలువురు సర్పంచ్‌లు రాజన్నదొర దృష్టికి బుధవారం తీసుకెళ్లారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తామని ఫిర్యాదు కాపీని రాజన్నదొరకు ఆయన నివాసంలో అందజేశారు. దీనిపై మాజీ డిప్యూటీ సీఎం స్పందిస్తూ పార్వతీపురం జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అధికారులు గిరిజన సర్పంచ్‌లను అవహేళన చేసి మాట్లాడడం తగదన్నారు. ఉపాధిహామీ అధికారి అల్లువాడ గోపాలకృష్ణ, సాలూరు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ గొట్టాపు సంధీప్‌లు గిరిజన సర్పంచ్‌లను గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని, వీరి తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి చెప్పిన పనులు మాత్రమే చేస్తామని బహిరంగంగా చెబుతుండడం ఆగ్రహం వ్యక్తంచేశారు. 1994 సెక్షన్ 45 పంచాయ తీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌ల హక్కులు, అధికారాలకు భంగం కలిగితే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఆర్టికల్ 243 ద్వారా సర్పంచ్‌లకు అధికారాలు ఉన్నాయని, అలా కాకుండా అధికారులు సర్పంచ్‌లపై దురుసు గా వ్యవహరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం 33/1989 ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఉపాధి హామీ రిట్ పిటిషన్ నంబర్ 2174/2025పై ఫిబ్రవరి 3న ఉపాధి హామీ పనుల మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు ధిక్కరిస్తున్నారన్నారు. పాచిపెంట మండలం గిరిజన సర్పంచ్‌లందరూ కలిసి ఏపీ గిరిజన శాఖ కమిషనర్, కలెక్టర్, జాతీ య మానవ హక్కుల సంఘం చైర్మన్‌కు అధికారు ల తీరుపై ఫిర్యాదు చేస్తామన్నారు.
హైకోర్టు తీర్పును ధిక్కరించిన
అధికారులపై కోర్టుధిక్కరణ కేసు వేస్తాం
సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా అడ్డగోలు నిర్ణయాలు సరికాదు
మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
Comments
Please login to add a commentAdd a comment