‘మన్యం సహజ రైతు ఉత్పత్తి దారులకు’ జాతీయ అవార్డు
సీతంపేట: మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టీవ్ ఎంటర్‌ప్రైజస్ అవార్డు వరించింది. కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో ఈ నెల 8వ తేదీన అవార్డును కంపెనీ సభ్యులు అందుకుంటారని ఆర్ట్స్ డైరెక్టర్ నూక సన్యాసిరావు తెలిపారు. 70 గ్రామాల్లో 1507 మంది వాటా దారులు (రైతులు) ఇందులో సభ్యులుగా ఉన్నారు. పసుపు, జీడి, చిరుధాన్యాలు, పైనా పిల్, కొండచీపుర్లు వంటి పంటల గ్రేడింగ్, విలువ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పైనాపిల్‌జామ్, జ్యూస్, క్యాండీస్, పన సతో చిప్స్, చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ వంటి అంశాలపై ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయంగా యూనిట్లు నిర్వహిస్తున్నట్టు సంఘ సభ్యులు గౌరమ్మ, సీఈఓ శంకరరావు తెలిపారు.
దేవదాయశాఖ భూముల
పరిరక్షణే ధ్యేయం
విజయనగరం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయమని ఆ శాఖ జిల్లా సహాయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. విజయనగరంలోని దేవదాయశాఖ కార్యాలయంలో ఆమె గురువారం మాట్లాడారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 9,900 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. వాటిలో నాలుగువేల ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నట్టు వెల్లడించారు. శిస్తుల రూపంలో 2వేల ఎకరాల భూములకు రూ.50 లక్షలు, ఆస్తుల లీజుల వల్ల రూ.57 లక్షల ఆదాయం సమకూరుతోందని తెలిపారు. శిస్తులు చెల్లించాలని రైతులకు చెప్పామన్నారు. జిల్లాలో 473 ఆలయాల రిజిస్టరై ఉన్నాయని, భూములున్న దేవాలయాలు 313కాగా, 165 ఆలయాలు మాత్రమే కార్యనిర్వహణాధికారుల చేతుల్లో ఉన్న ట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment