నేడే జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలతో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కుబౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు వాటర్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు, ఇరుపార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చునన్నారు. కక్షిదారులు, ప్రజలు శనివారం జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment