
మహిళా చైతన్యంతో సమాజాభివృద్ధి
పార్వతీపురం రూరల్: మహిళా చైతన్యంతో సమాజ అభివృద్ధి సాధ్యమని, మహిళలు అన్నిరంగాల్లోనూ రాణించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీసుల ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు పోలీస్‌శాఖ అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రతీ విద్యార్థిని చక్కగా చదువుకొని భవిష్యత్‌లో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మహిళలకు రాజకీయాలు, వ్యాపార, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవకాశాలు అపారమన్నారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన మహిళా సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, ఎస్‌బీ సీఐ రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు, సోషల్ మీడియా సీఐ శ్రీనివాసరావు, రూరల్ ఎస్‌ఐ సంతోషి, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment