ముందుచూపు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ముందుచూపు తప్పనిసరి

Published Tue, Mar 11 2025 12:47 AM | Last Updated on Tue, Mar 11 2025 12:45 AM

ముందు

ముందుచూపు తప్పనిసరి

గ్లకోమాపై నిర్లక్ష్యం..

కంటి చూపుపై ప్రభావం

వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు అవసరం

వైద్యుల సూచనలు తప్పనిసరి.

40 ఏళ్లు దాటితే రెండేళ్ల కోసారి నేత్ర పరీక్షలు చేయించుకోవాలి.

ఈ నెల 15వరకు గ్లకోమా

వారోత్సవాలు

గ్లకోమా నివారణకు చర్యలు..

● గ్లకోమా వ్యాధి కుటుంబ చరిత్ర కలవారు ముప్‌పై సంవత్సరాల వయసు నుంచే సమగ్ర నేత్ర పరీక్షలు(దృష్టి పరీక్ష, కంటిలో ఒత్తిడి, ఫంగస్‌ ద్వారా రెటీనా పరీక్షలు, క్షేత్ర దృష్టి పరీక్షలు) చేయించుకోవాలి.

● 40 సంవత్సరాలు వయసు దాటిన తరువాత క్రమం తప్పకుండా రెండేళ్లకు ఒకసారి సమగ్రంగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి.

● వైద్యుల సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్‌ మందులు లేదా కంటి చుక్కల మందు వాడాలి.

● కంటి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా నేత్ర నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి.

● గ్లకోమా వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు నేత్ర నిపుణుల సలహా, సూచనల ప్రకారం నేత్ర పరీక్షలు చేసుకోవడం, మందులు వాడడం చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వం వస్తుంది.

రాజాం సిటీ/పార్వతీపురంటౌన్‌: సృష్టిలో ప్రకృతి అందాలను వీక్షించాలంటే కంటి చూపు తప్పనిసరి. జ్ఞానేంద్రియాలన్నింటిలోను కంటి చూపు చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేవరకు మంచి దృష్టితో జీవించాలని కోరుకుంటాడు. అయితే కంటి ఆరోగ్యం, కంటి దృష్టిపై అవగాహనలేక చాలా మంది అంధత్వం బారిన పడుతున్నారు. కంటి శుక్లాలు, కంటి వక్రీభవన దృష్టి లోపాలు, గ్లకోమా వంటివి అంధత్వానికి ప్రధాన కారణం. గ్లకోమాను నీటి కాసులుగా కూడా పిలుస్తారు. గ్లకోమా వ్యాధితో ఒక్కసారి దృష్టిని కోల్పోతే తిరిగి పొందలేము. 40 ఏళ్లు పైబడిన వారిలో 1.12 శాతం గ్లకోమా వ్యాధితో బాదపడుతున్నవారే అధికం. ఈ వ్యాధి మనకంటిలోని ఆప్టిక్‌ నాడికి నష్టం కలిగించడం ద్వారా దృష్టిని క్రమక్రమంగా క్షీణించేలా చేస్తుంది. గ్లకోమాలో సాధారణంగా ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాప్తి చెంది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 9 నుంచి 15 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ‘గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తద్వారా ఈ వ్యాధి వల్ల సంక్రమించే అంధత్వాన్ని నివారించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
ముందుచూపు తప్పనిసరి1
1/1

ముందుచూపు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement