
పెద్దపల్లి: మున్సిపల్ పరిధిలోని రజకనగర్‌కు చెందిన నిరుపేద వృద్ధురాలు ఇప్పకాయల వెంకటమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. కూతురే తల్లి చితికి నిప్పంటించడంతో పలువురిని కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. రజకనగర్‌కు చెందిన వెంకటలక్ష్మీకి కూతురు పద్మ ఉంది.
తల్లి బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో పద్మ వివాహం కూడా చేసుకోలేదు. వెంకటమ్మ బుధవారం అనారోగ్యంతో మృతిచెందింది. నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు మాజీ జెడ్పీటీటీసీ ఐల రమేశ్, పలువురు దాతలు ఆర్థికసాయం అందజేశారు.
ఐల రమేశ్ రూ.3 వేలు, మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత, రూ.3 వేలు, పద్మశాలీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి రూ.3 వేలు అందజేశారు. పద్మశాలీ కుల సంఘం పెద్దలు అయిల సాంబమూర్తి, ఆడెపు అంబదాసు, పెగడ పరుశరాములు, కొండ సత్తయ్య, కాలనీవాసులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment