
గోమాస శ్రీనివాస్
పెద్దపల్లి పార్లమెంట్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేసీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరు ఖరారైంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీల అభ్యర్థులు ఖరారైనట్లయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎవరికీ దక్కుతుందో తెలియాల్సి ఉంది.
రాజకీయ పార్టీల తహతహ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా... ప్రస్తుతం బీజేపీ తమ అభ్యర్థిగా నేతకాని వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించింది. ఇక రాష్ట్రంలో ఇటీవల అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ ఏర్పడింది. ఆ పార్టీ అభ్యర్థిత్వం ఇంకా ఎవరికీ ఖరారు చేయక పోవడంతో పార్టీ అధిష్టానం వద్ద తమ పేరునే ఖరారు చేసేలా చూసుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ పోటీపడుతుండగా..ఆయనకు పోటీగా మాజీ ఎంపీ సుగుణకుమారితో పాటు పలువురు నాయకులు పార్టీ టికెట్టు కోసం పోటీపడుతున్నారు.
బయోడేటా
పేరు : శ్రీనివాస్ గోమాస
పుట్టిన తేదీ : 15–10–1969
పుట్టిన స్థలం : మంచిర్యాల
విద్యార్హత : ఎంఏ పొలిటికల్ సైన్స్
వృత్తి : వ్యాపారం, వ్యవసాయం
తల్లిదండ్రులు : కీ.శే.రాజయ్య,మల్లు భాయ్
భార్య పేరు : గీత
సంతానం : ఇద్దరు కూతుర్లు, కుమారుడు
రాజకీయ నేపథ్యం:
1982 నుంచి 1992 సంవత్సరం వరకు విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకుడిగా..
1993లో కాంగ్రెస్ పార్టీలో చేరిక.
2003 వరకు కాంగ్రెస్ లోనే కొనసాగింపు
2009లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి.. చివరలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి పెద్దపల్లి నుంచి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 2,64,731 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment