
జాతీయ పార్టీలే!
మండలి బరిలో
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ మండలి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగింపు రోజు నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధా న పార్టీ అభ్యర్థులంతా జాతీయ పార్టీల తరఫున బరిలోకి దిగుతుండటం గమనార్హం. గ్రాడ్యుయేట్స్ బరిలో నలుగురు అభ్యర్థులు ఉండగా.. టీచర్స్ బరిలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్స్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అ ల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, బీజే పీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి ముందే బీఫాంలు ఖరారు చేసుకుని ప్రచారం ప్రారంభించారు. కానీ.. రవీందర్‌సింగ్, ప్రసన్నహరికృష్ణలు బీఆర్‌ఎస్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డారు. నామినేషన్ ఆఖరురోజైన సోమవా రం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నా యి. ఎలాగోలా పోటీకి సిద్ధమైన సింగ్ ఏఐఎఫ్ బీ నుంచి, హరికృష్ణ బీఎస్పీ తరఫున బీఫాంలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.
ముందుకు వచ్చేందుకే..
చివరి నిమిషం వరకు రవీందర్‌సింగ్, ప్రసన్న హరికృష్ణ స్వతంత్రంగానే బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరూ బీఫాం సమర్పించే వరకు ఇతర పార్టీలో చేరిన విషయం గోప్యంగా ఉంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. స్వతంత్రులుగా ఉంటే ఎక్కడో ఆఖరున పేరుంటుంది. కానీ.. జాతీయ పార్టీ అభ్యర్థులు బ్యాలెట్‌లో ముందు ఉంటారు. అందుకే.. ఆయాపార్టీల అ భ్యర్థులుగా బరిలోకి దిగితే.. తమకు బ్యాలెట్‌లో ప్రాధాన్యం దక్కుతుందన్న ఆలోచనతో జాతీయ పార్టీల బీ ఫాం పొందారు. సోమవారం రవీందర్‌సింగ్ తన అనుచరులతో కలిసి కేసీఆర్ చిత్రపటంతో వెళ్లి మరీ నామినేషన్ వేశారు. దీంతో రవీందర్‌సింగ్ బీఆర్‌ఎస్‌లో ఉన్నట్టా? లేనట్లా? అన్న విషయమై పార్టీలో గందరగోళం నెలకొంది. దీరనిపై సింగ్ మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఇస్తుందని ఎంతో ఆశపడ్డానన్నారు. ఇప్పటికై నా ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తనకు మద్దతుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తేమీ కాదు..
ఆఖరు నిమిషంలో అసంతృప్తులు ఏఐఎఫ్‌బీ టికెట్ తెచ్చుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తేం కాదు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెబల్ కోరుకంటి చందర్ రామగుండం ఎమ్మెల్యేగా ఏఐఎఫ్‌బీపైనే గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత పాత జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏఐఎఫ్‌బీ తన సత్తాచాటింది. అలాగే బీఎస్పీ 2014 ఎన్నికల్లో అసెంబ్లీలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2018 ఎన్నికల్లోనూ బీఎస్పీ నుంచి పలువురు సీనియర్ లీడర్లు పోటీ చేశారు.
టీచర్స్‌లో ఇద్దరే..
టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే.. బీజేపీ నుంచి మల్క కొమురయ్య పోటీ చేస్తుండగా, బీఎస్పీ నుంచి యటకారి సాయన్న బరిలో ఉన్నారు. వీరి ద్దరూ ప్రచారం స్పీడ్ పెంచారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో వీరిద్దరే జాతీ య పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. ఇక ఎస్టీయూ, టీపీఆర్టీయూ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, యూటీఎఫ్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, టీపీటీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశో క్ కుమార్ కూడా ప్రచారం ముమ్మరం చేశారు.
అకస్మాత్తుగా తెరమీదికి రెండు నేషనల్ పార్టీలు
ఏఐఎఫ్‌బీ నుంచి రవీందర్ సింగ్, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ
వీరికి టికెట్ నిరాకరించిన బీఆర్‌ఎస్ అధిష్టానం
కేసీఆర్ బొమ్మతో వెళ్లి ఏఐఎఫ్‌బీ బీఫాం ఇచ్చిన సింగ్
ప్రచారంలో దూకుడు పెంచిన నరేందర్‌రెడ్డి, అంజిరెడ్డి
టీచర్స్‌లో జాతీయ పార్టీల అభ్యర్థులు ఇద్దరు
దూకుడు పెంచిన నరేందర్‌రెడ్డి, అంజిరెడ్డి..
కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు ఉమ్మడి జిల్లా విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన అభ్యర్థులంతా మద్దతుతో భారీర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తో కాంగ్రెస్ నాయకుల్లో కొత్తజోష్ నెలకొంది. ఇదే ఉత్సాహంతో నరేందర్‌రెడ్డి ప్రచా రం స్పీడ్ పెంచారు. కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాలేజీలకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాలు, నోటిఫికేషన్లు వివరిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న చిన్నమైల్ అంజిరెడ్డి కూడా ప్రచారంపై దృష్టి సారించారు. ఆయన సతీమణి గోదావరి కూడా అంజిరెడ్డి తరఫున ప్రచారం ముమ్మరం చేశారు.

జాతీయ పార్టీలే!

జాతీయ పార్టీలే!

జాతీయ పార్టీలే!

జాతీయ పార్టీలే!
Comments
Please login to add a commentAdd a comment