
జలవెల..
గురువారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
చామనపల్లిలో నీళ్లందక ఎండిపోయిన వరి
కథలాపూర్ మండలం కలిగోట శివారులో అడుగంటిన సూరమ్మ చెరువు
కరీంనగర్‌రూరల్: ఈ ఫొటో కరీంనగర్ మండలం చామనపల్లిలోనిది. ఓ వైపు ఎస్సారెస్పీ నీళ్లు అందక, మరోవైపు వ్యవసాయబావుల్లోని నీరు సరిపోక వేసిన వరి ఇలా ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి అయినా చేతికొస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు మొక్కజొన్న సాగు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు కొంతమంది కొత్తగా బోర్లను వేయిస్తుండగా.. మరికొందరు బావుల్లో పూడిక తీయిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు చేస్తున్న చివరి ప్రయత్నాలు ఫలించడంలేదు.
కథలాపూర్/రుద్రంగి: జగిత్యాల జిల్లా కథలా పూర్ మండలంలోని చాలా గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరు అయిన కలిగోట శివారులోని సూరమ్మ చెరువు అడుగంటిపోయింది. మండలంలోని బొమ్మెన ప్రాజెక్టు, తాండ్య్రాల ఊరచెరువు, దుంపేట గ్రామాల చెరువులకు ఈ చెరువు నీరే ప్రధానం కాగా.. వాటికింద వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కలిగోట, అంబారిపేట, పోతారం, తాండ్య్రాల గ్రామాల్లోని బోరుబావుల్లో నీరు కొద్దిగానే వస్తోందని రైతులు తెలిపారు. వచ్చే
రెండునెలలు పంటలు కాపాడుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతలతో సూరమ్మ చెరువు నింపాలని కోరుతున్నారు.
సూరమ్మ చెరువు నింపాలి
వర్షాలు బాగా కురిశాయని కలిగోట గ్రామంలో ఎక్కువగా వరి సాగు చేసినం. సూరమ్మ చెరువులో నీళ్లు అడుగంటిపోయాయి. మా గ్రామ శివారులోని సగం బోరుబావుల్లో ఇప్పుడు కొద్దిగానే నీళ్లు వస్తున్నాయి. ఇట్లుంటే వరికి నీళ్లందడం కష్టం. పంటలు ఎండిపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి. సూరమ్మ చెరువు నింపాలి. – గంగం గంగారెడ్డి,
రైతు, కలిగోట, కథలాపూర్
బోరు వేసినా లాభం లేదు
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. బాయిల నీళ్లు లేకపోవడంతో రూ.2లక్షలతో కొత్తగా బోరు వేయించిన. అయినా నీళ్లు అందడంలేదు. ఇప్పటికే నీరు లేకపోవడంతో రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట ఎండిపోగా మిగితా పంటకూడా ఎండిపోయేలా ఉంది.
– బోగొండ రాజు, రైతు,
చామనపల్లి, కరీంనగర్
ఆశల యాసంగి అన్నదాతను ఉసూరుమనిపిస్తోంది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి
పంటవేస్తే ఆదిలోనే నీటిగోస ఎదురవుతోంది. శివరాత్రికి ముందే ఎండలు దంచికొడుతుండగా.. వాగుల్లో నీరు ఆవిరవుతోంది. ఫిబ్రవరి రెండోవారంలోనే చెరువులు వెలవెలబోతున్నాయి. బోర్లు వట్టిపోయి.. గుంటభూమి కూడా తడవని పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. జిల్లాలో వరి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేయగా.. చాలా ప్రాంతాల్లో పీచుపెట్టక ముందే మొక్కజొన్న ఎండిపోతోంది. దీంతో పంట పశువుల పాలవుతోంది. కలుపు దశలో ఉన్న వరికి నీరందకపోవడంతో పంట ఎదుగుదల లోపించింది. భూమి బీటలుబారి పొలాలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టుకు అందకపోతుండగా.. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో సైతం నీటిమట్టం తగ్గుతోంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. పంటలు చేతికందుతాయో.. లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – వివరాలు 8లోu
●
విలవిల
ముదురుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు
అడుగంటుతున్న జలవనరులు..వట్టిపోతున్న బోర్లు
ఉమ్మడి జిల్లాలో పశువుల మేతగా పంటలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు
వేసవికి ముందే ప్రమాద ఘంటికలు

జలవెల..

జలవెల..

జలవెల..

జలవెల..
Comments
Please login to add a commentAdd a comment