
ముంచుకొస్తున్న గడువు
● జిల్లాలో ఆస్తిపన్ను వసూలు పూర్ ● నిర్లక్ష్యం వీడని బల్దియా అధికారులు ● వెనుకబడిన మున్సిపాలిటీలు ● మంథని రాష్ట్రంలోనే 16వ స్థానం ● రామగుండం బల్దియా 38వ స్థానం ● బకాయిదారులకు రెడ్ నోటీసులు ● రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో గుబులు
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలతోపాటు ఇతర అభివృద్ధి పనుల నిర్వహణకు ఆస్తిపన్ను(ప్రాపర్టీ ట్యాక్స్) ప్రధాన ఆదాయవనరు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు వస్తున్నా ఇప్పటికీ అధికారులు ఉదాసీనత వీడడం లేదు. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఆశించినస్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడంలేదు. కనీసం పూరోగతి కానరావడం లేదు. రామగుండం నగరపాలక సంస్థలో కేవలం 52.59 శాతం మాత్రమే ఆస్తిపన్ను నమోదు కావడం గమనార్హం.
మంథని ముందు.. సుల్తానాబాద్ వెనుకంజ..
రాష్ట్రంలో మొత్తం 139 మున్సిపాలిటీలు ఉండగా ఈనెల 6వ తేదీ వరకు ఆస్తిపన్ను వసూలు చేసిన బల్దియా జాబితాలో జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఆశించిన పు రోగతి కానరావడంలేదు. మంథని ఆస్తిపన్ను వసూ ళ్లలో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలవగా రామగుండం 38వ స్థానం, పెద్దపల్లి 24వ స్థానం, సుల్తానాబాద్ 111వ స్థానంలో నిలిచి వెనుకపడిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ 77. 14 శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
రామగుండం నగరంలో 52.59 శాతమే..
రామగుండం నగరపాలక సంస్థలో మొత్తం 50,956 ప్రైవేట్, 16,262 ప్రభుత్వ అసెస్మెంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ అసెస్మెంట్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ రూ.16.16కోట్ల వరకు ఉండగా, ఈనెల 10వ తేదీ వరకు రూ.8.50కోట్ల వరకు వసూలయ్యాయి. దీంతో 52.59 శాతమే వసూలు నమోదైంది. ప్రభుత్వ అసెస్మెంట్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ రూ.5.21కోట్లు ఉండగా, రూ.4.77 కోట్లు వసూలై.. 91.47 శాతం నమోదైంది.
బకాయిదారులకు రెడ్ నోటీసులు..
2024–25 ఆర్థిక సంవత్సరం గడువు సమీపిస్తుండడంతో మొండి బకాయిదారుల నుంచి ఆస్తిపన్ను వసూలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో ఇప్పటికే చాలామందికి రెడ్ నోటీసులు జారీచేశారు.
రెవెన్యూ రికవరీ యాక్ట్ గుబులు..
రామగుండం నగరంలో తొలిసారి కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలతో కొద్దిరోజులుగా రెవెన్యూ రివకరీ యాక్ట్ అమలు చేస్తున్నారు. దీనిద్వారా బకాయిదారుల్లో గుబులు పుడుతోంది. ఇటీవల 10 మంది మొండి బకాయిదారులకు తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ రివకరీ యాక్ట్ నోటీసులు జారీ చేశారు. బకాయిలు చెల్లించకుంటే ఆస్తి జప్తు చేసి వేలం పాట నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీంతో చాలామందిలో స్పందన వచ్చింది. కొందరు బకాయిలు చెల్లించడానికి ముందకు రాగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు.
ఈనెల 6 వరకు వసూలైన ఆస్తిపన్ను
నిర్దేశిత లక్ష్యం సాధిస్తాం
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో నిర్దేశిత ఆస్తిపన్ను లక్ష్య సాధనకు రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మొండి బకాయిదారుల పేర్లను బహిర్గతం చేస్తాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తాం.
– అరుణశ్రీ, బల్దియా కమిషనర్
(ఎఫ్‌ఏసీ), రామగుండం
బల్దియా వార్డులు అసెస్మెంట్స్ డిమాండ్ వసూలు శాతం
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
రామగుండం 50 50,956 16.1 8.50 52.59
పెద్దపల్లి 36 12,058 5.42 3.06 54.46
సుల్తానాబాద్ 15 5,425 2.78 0.94 33.80
మంథని 13 5,089 1.74 1.04 59.77

ముంచుకొస్తున్న గడువు
Comments
Please login to add a commentAdd a comment