
ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే
ఓదెల(పెద్దపల్లి): భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లన్న సన్నిధిలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులకు గురువుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతీ ఆది, బుధవారాల్లో లక్ష వరకు భక్తులు వస్తుంటారు. కేవలం ఐదు మరుగుదొడ్లు ఉండటంతో మహిళల పరిస్థితి చెప్పనక్కరలేదు. సరిపడా మరగుదొడ్లు లేక భక్తులు రోడ్ల వెంట, పంటపొలాల్లో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోడ్ల వెంట దుర్గంధం వెదజల్లుతోంది.
సౌకర్యాలు అంతంతే..
● మల్లన్న సన్నిధిలో మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో కలెక్టర్ పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది.
● భక్తులకు సరిపడా షెడ్లు లేక చెట్ల కింద సేద తీరాల్సి వస్తోంది. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ ఇబ్బందులు పడుతున్నారు.
● చాలా ఏళ్ల క్రితం తాగునీటి ట్యాంకులు నిర్మించడంతో భక్తులకు నీరు సరిపోవడంలో లేదు. ప్రతీ ఆది, బుధవారాల్లో వాహన పూజలకు వచ్చేవారు రోడ్డుపై పార్కింగ్ చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
● కోనేరును అసంపూర్తిగా నిర్మించడంతో భక్తులకు ఉపయోగపడటం లేదు.
● ఆలయంలో స్వామివారికి పట్నాలు వేసే ఒగ్గు పూజారులకు గదులు లేవు. 72 మంది ఒగ్గు పూజారులకు గదులు నిర్మించాలని పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● ఆలయం ద్వారా దేవాదాయశాఖకు ఆదాయం సమకూరినా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించాలని కోరుతున్నారు.
ఓదెల మల్లన్న సన్నిధిలో వసతుల లేమి
కనీస సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు
ప్రతిపాదనలు పంపించాం
ఓదెల ఆలయంలో భక్తులకు సరిపడా సౌకర్యాల కల్పనకు సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూ రు కాగానే అభివృద్ధి పనులు చేపడుతాం.
– బొడ్క సదయ్య, ఆలయ ఈవో

ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే

ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే

ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే
Comments
Please login to add a commentAdd a comment