
మహిళాభివృద్ధికి కృషి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ దీప్తి మహిళా సమితి మహిళాభివృద్ధికి కృషి చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని దీప్తి మహిళా సమితి భవనంలో ఆనంద మేళా సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు బుధవారం అతిథులు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామంత మాట్లాడారు. సామాజిక అభివృద్ధికి.. ప్రత్యేకంగా మహిళలు, శిశు సంక్షేమానికి మేళాతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, సచ్‌దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రిన్సిపాల్ జ్ఞాన్‌చంద్‌తోపాటు మహిళా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల సెక్టోరల్ ఆఫీసర్ జగదీశ్వర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా కాల్వశ్రీరాంపూర్‌లో రెండు, ఓదెలలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఆస్తిపన్ను వసూలుకు బల్దియాలో స్పెషల్ డ్రైవ్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఆస్తిపన్ను బకాయిల వసూలుకు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి నేతృత్వంలో ఆర్‌వో ఆంజనేయులు, ఆర్‌ఐ శంకర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ స్వయంగా మొండిబకాయిదారుల ఇళ్లకు వెళ్లి ఆస్తిపన్ను చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నారు. వాహనాలకు మైకులు అమర్చి ప్రతీ డివిజన్‌లో ప్రచారం చేస్తున్నారు. మొండిబకాయిదారులకు చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గర్రెపల్లి సింగిల్‌విండో సీఈవోపై ఫిర్యాదు
సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి సింగిల్‌విండో భవనం కోసం కొనుగోలు చేసిన స్థలం విషయంలో సీఈవో అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తంగళ్లపల్లి రాజ్‌కుమార్, స్థలం విక్రేత శ్రీనివాస్ బుధవారం కరీంనగర్‌లోని కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. స్థలం కొనుగోలులో పాలకవర్గం, సీఈవో అవినీతికి పాల్పడ్డారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. భూ విక్రేయత శ్రీనివాస్‌కు రావాల్సిన రూ.2లక్షలు ఇప్పించాలని అందులో పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు ఆత్మకూరి తిరుపతి, కవ్వంపెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళాభివృద్ధికి కృషి
Comments
Please login to add a commentAdd a comment